ETV Bharat / state

హుస్నాబాద్​లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు

author img

By

Published : Feb 21, 2021, 2:56 PM IST

హుస్నాబాద్ పట్టణంలో ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పించారు. సీపీ జోయల్ డేవిస్ ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఏసీపీ మహేందర్ పేర్కొన్నారు.

Rapid Action Force Flag March at husnabad in siddipeta district
హుస్నాబాద్​లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ (కవాతు) నిర్వహించారు. శాంతిభద్రతల నిర్వహణలో మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, నాగారం ఎక్స్ రోడ్, గాంధీ చౌరస్తా, మల్లె చెట్టు చౌరస్తా మీదుగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఏసీపీ తెలిపారు.

అగ్ని ప్రమాదాలు, వరదలు, ఇతర విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు.. కాపాడడానికి, భద్రత కల్పించడానికి మేమున్నామంటూ ప్రజలకు తెలియజేశారు. సీపీ జోయల్ డేవిస్ ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా జిల్లాల్లో ఏరియా లొకేషన్ తెలుసుకోవడానికి కూడా ఇలాంటి ఫ్లాగ్ మార్చ్​లను ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నిర్వహిస్తుందన్నారు.

ఇదీ చూడండి: యాదాద్రీశుడి దర్శనానికి బారులు తీరిన భక్తజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.