ETV Bharat / state

కరవు నేలల్లో గోదారమ్మ పరవళ్లు - ranganayaka sagar project latest news

సిద్దిపేట జిల్లాకు చేరిన గోదారమ్మ కరవు నేలకు జల ప్రదాయినిగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్‌కు గోదావరి జలాల ఎత్తిపోతల ప్రక్రియ కొనసాగుతోంది.

ranganayaka sagar project latest news
ranganayaka sagar project latest news
author img

By

Published : May 1, 2020, 10:38 AM IST

రంగనాయక సాగర్​ నుంచి త్వరలో కొండపోచమ్మ జలాశయానికి నీటిని ఎత్తిపోసి కాలువల ద్వారా పంట పొలాలకు నీరిచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఈమేరకు గ్రామాల్లో పంట కాలువల తవ్వకానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సుమారు 5.24 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలన్నది సర్కారు లక్ష్యం. కాలువల ద్వారా సాగునీరందే అవకాశం లేకపోవటంతో మొన్నటి వరకు మెదక్‌ జిల్లాలో కొంత ప్రాంతం మినహా అంతటా సేద్యానికి విద్యుత్తు ఆధారిత బోరు బావులే దిక్కు. వానాకాలంలో పునాస పంటలు, యాసంగిలో బోరుబావుల ఆధారంగా అడపాదడపా వరి, కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి రైతుల సాగునీటి కష్టాలు కాళేశ్వరం ప్రాజెక్టుతో తీరుస్తామని గతంలో పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

ఉమ్మడి జిల్లాలో దాదాపు 8 లక్షల మంది రైతులు సుమారు 10 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా ప్రాజెక్టులకు దిగువన ఉన్న భూములతో పాటు, చెరువుల ద్వారా నీరందించే అకాశం ఉన్న వాటిని ఈ ప్రాజెక్టు కిందకు తీసుకొచ్చారు.

కాలువలు పూర్తి...

రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 1.14 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించగా సిద్దిపేట అర్బన్‌, రూరల్‌, నంగునూరు, చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాల పరిధిలోని పొలాలు ఉన్నాయి. అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి, ముస్తాబాద్‌, హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని కోహెడ, మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకుంట, జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, మద్దూరు మండలాలకు ఇక్కడనుంచే నీరందనుంది.

ప్రస్తుతానికి నిర్మాణ దశలో ఉన్నప్పటికీ పూర్తయిన తరువాత కొమురవెల్లి మల్లన్న సాగర్‌ ద్వారా గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో 1.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందనుంది. కొండపోచమ్మ సాగర్‌ ద్వారా గజ్వేల్‌తో పాటు దుబ్బాక, భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల పరిధిలో 2.85 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. దీంతోపాటు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలోని పటాన్‌చెరు, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల ప్రజల దాహార్తి సమస్య పరిష్కారానికి ఇక్కడి నుంచే నీటిని తరలిస్తారు.

జిల్లాలో ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా తొలుత గ్రామాల్లోని చెరువులను నింపి ఆ తరువాత కాలువల ద్వారా పొలాలకు నీరందించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులకు, అక్కడనుంచి చెరువులకు నీరందించే కాలువలు చాలా వరకు పూర్తయ్యాయి. చెరువుల నుంచి పొలాలకు నీటిని అందించే పంట కాలువలు నిర్మించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాలనాధికారి వెంకటరామరెడ్డి ఇటీవల గజ్వేల్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి పంట కాలువలకు అవసరమైన భూసేకరణను సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. వాటిని త్వరితగతిన పూర్తి చేసి వచ్చే సీజన్‌ నుంచే నీరందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.