కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో తెరాస ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుంటే... కేంద్రం రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ బిల్లు తెచ్చిందని దేవేందర్ రెడ్డి మండిపడ్డారు.

రైతులంతా ఈ బిల్లులను వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొగుట జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి, తెరాస నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'ఒక్క ఇల్లు కూడా కట్టలేదు... జాబితాలో మాత్రం చేర్చారు'