ETV Bharat / state

హుస్నాబాద్​లో ముగింపు దశకు రైతు సమగ్ర సమాచార సేకరణ - రైతు సమగ్ర సమాచార సేకరణ

రైతుల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించి వారు నూతన విధానాల్లో పంటలు పండించేలా ప్రొత్సహించేందుకు చేపట్టిన రైతు సమగ్ర సేకరణ కార్యక్రమం సిద్దిపేటలో ముగింపు దశకు చేరుకుంది. 32 గ్రామాల్లో 8,422 మంది రైతుల నుంచి సమాచారాన్ని సేకరించినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

రైతు సమగ్ర సమాచార సేకరణ
author img

By

Published : May 17, 2019, 4:50 PM IST

రైతుల నుంచి సమాచారాన్ని సేకరించిన వ్యవసాయ అధికారులు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం అక్కన్నపేటలో ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సమాచార సేకరణ ముగింపు దశకు చేరుకుంది. గత నెల రోజులుగా వ్యవసాయ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి... అన్నదాతల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించారు. రైతులు నేల స్వభావాన్ని బట్టి పంటలు పండించేలా వారికి అవగాహన కల్పించడం, పంట కాలనీల ఏర్పాటు వంటి అంశాలపై ప్రోత్సహించేలా దీనిని చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

పంటలకు అనుగుణంగా మార్కెట్లు

మొత్తం 32 గ్రామాల్లో 8,422 మందికి సంబంధించి సమగ్ర సమాచార సేకరణ చేశామని వ్యవసాయ అధికారి నాగేందర్​ తెలిపారు. రానున్న రోజుల్లో రైతులకు వారు పండించిన పంటలకు అనుగుణంగా మార్కెట్లను ఏర్పాటు చేయడానికే ఈ వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు సమాచార సేకరణ వల్ల అన్నదాతలకు మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి : వట్టెం జలాశయ భూ నిర్వాసితులకు అండగా కాంగ్రెస్​

Intro:TG_KRN_101_17_RYTHULA SAMAGRA_SAMACHARA_SEKARANA_AVB_C11
FROM:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సమాచార సేకరణ కార్యక్రమంలో భాగంగా రైతుల సమగ్ర సమాచార సేకరణ పూర్తి కావస్తోంది. గత నెల రోజుల నుండి వ్యవసాయ అధికారులు గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ రైతుల సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కన్నపేట మండల వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలోనే అక్కన్నపేట మండలం 32 గ్రామాలతో పెద్ద మండలంగా ఉందని, 32 గ్రామాలలో 10731 మంది రైతులకు గాను 8422 మంది రైతుల యొక్క సమగ్ర సమాచార సేకరణ పూర్తి చేయడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాబోతుండడంతో పంటలకు నీటి వసతి పెరగనుందని, రైతులు అందరూ ఒకే రకమైన పంటలు పండించి నష్టపోకుండా వారి నేల స్వభావం, స్థానిక అవసరాలను బట్టి పంటలు పండించడంలో వారికి అవగాహన కల్పించడం, రానున్న రోజుల్లో పంట కాలనీల ఏర్పాటు ద్వారా ఏర్పాటు చేయబోతున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుబంధంగా పంటలను పండించే విధంగా రైతులను ప్రోత్సహించదానికి కృషి చెయ్యడం ఈ రైతు సమగ్ర సమాచార ముఖ్య ఉద్దేశమని అన్నారు. డివిజన్ స్థాయిలో ఏ గ్రామాలలో, ఏ పంటలు పండుతాయో అనే మాస్టర్ ప్లాన్ రూపొందించి రానున్న రోజుల్లో రైతులకు వారు పండించిన పంటలకు అనుగుణంగా మార్కెట్లను ఏర్పాటు చేయడానికి ఈ రైతు సమగ్ర సమాచార సేకరణ చేపడుతున్నామని ఆయన అన్నారు.

Body:బైట్

1) అక్కన్నపేట మండల వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డి

Conclusion:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్లో పూర్తికావస్తున్న రైతు సమగ్ర సమాచార సేకరణ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.