సిద్దిపేట జిల్లా దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మండలాల్లో ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానకు డ్రైనేజీలు నిండి రోడ్లపైకి నీరు చేరింది.
ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రెండు, మూడు రోజులుగా వేడి వాతావరణం ఉండి మధ్యాహ్నం నుంచి ఉన్నట్టుండి భారీ వర్షం కురవడం వల్ల వాతావరణం అంతా చల్లబడింది.
ఇవీ చూడండి: గేటెడ్ కమ్యూనిటీల్లో కరోనా చికిత్