సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాన కురవడం వల్ల రోడ్ల పక్కనే వ్యాపారం చేసుకునే చిరువ్యాపారస్తులు ఇబ్బందులు పడ్డారు. పొద్దంతా ఎండకాసి ఒక్కసారిగా వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. వర్షం వల్ల ప్రయాణికులు కాస్త ఇబ్బందులు పడినా రైతన్నలు మాత్రం ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: చంచల్గూడ జైలుకు నౌహీరా షేక్