ETV Bharat / state

ఆ మూడు గ్రామాల్లో కాషాయ జెండా ఆవిష్కరించిన రఘునందన్​రావు

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని మూడు గ్రామాల్లో భాజపా రాష్ట్ర కార్యదర్శి, దుబ్బాక భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లోని పెద్దలకు, యువతకు కాషాయ కండువా కప్పి పార్టీలోని ఆహ్వానించారు.

ఆ మూడు గ్రామాల్లో కాషాయ జెండా ఆవిష్కరించిన రఘునందన్​రావు
ఆ మూడు గ్రామాల్లో కాషాయ జెండా ఆవిష్కరించిన రఘునందన్​రావు
author img

By

Published : Sep 6, 2020, 8:31 PM IST

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్​ రావు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని రామ్​సాగర్, వీరనగర్, ఎల్కల్ గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

కాషాయ జెండా కప్పి...

గ్రామాల్లోని పలువురు పెద్దలను, యువకులకు కషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని... ఇప్పుడా అమరుల త్యాగాలను తెరాస ప్రభుత్వం మరిచిపోయిందని రఘునందన్ రావు అన్నారు. కార్యక్రమంలో జిల్లా భాజపా దళిత మోర్చా అధ్యక్షుడు మంకిడి స్వామి, భాజపా రాయపోల్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, చేగుంట మండలం వైస్ ఎంపీపీ మున్నూరు రాంచెందర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి, కోండి స్వామి, ఉప సర్పంచ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు అక్కడక్కడా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.