ETV Bharat / state

బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలెవరూ సంతోషంగా లేరు : ప్రియాంక గాంధీ - తెలంగాణలో ప్రియాంకగాంధీ ప్రచారం

Priyanka Gandhi Election Campaign in Husnabad : కాంగ్రెస్‌ గెలవగానే ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.2500 వేస్తామని సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ కాంగ్రెస్‌ బహిరంగ సభలో కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో అవినీతి జరిగిందని.. ఆయన దత్తత తీసుకున్న ముల్కనూరులో అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు.

Priyanka Gandhi Telangana Tour
Priyanka Gandhi Election Campaign Today
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2023, 7:09 PM IST

Priyanka Gandhi Election Campaign in Husnabad : బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఒప్పందం ఉందని.. బీఆర్ఎస్‌, బీజేపీకి ఎంఐఎం సహకరిస్తోందని కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆమె హాజరయ్యారు. తెలంగాణ గడ్డ నుంచి వచ్చిన పీవీ నర్సింహరావు అంటే సోనియా కుటుంబానికి ఎంతో గౌరవమని ఆమె తెలిపారు. రాజీవ్‌ గాంధీ చనిపోయినప్పుడు పీవీ నర్సింహరావు తమ కుటుంబానికి ఎంతో అండగా నిలిచారని తెలిపారు.

Priyanka Gandhi Comments on BRS : బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని ప్రియాంక గాంధీ(Priayanka Gandhi) అన్నారు. సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న ముల్కనూరులో అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. దీంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రాజెక్టులను.. ప్రాజెక్టుల భూనిర్వాసితులకు పరిహారం వచ్చిందా అని నిలదీశారు. బీఆర్ఎస్‌ పదేళ్ల పాలనలో ఎవరికీ మేలు జరగలేదని విమర్శించారు. నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉందని వ్యాఖ్యానించారు.

ప్రజాధనం ప్రజలకే చెందాలనేదే కాంగ్రెస్‌ విధానం : ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Election Campaign in Telangana : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చదువుకున్న యువత భవిష్యత్‌ అంధకారంలోకి వెళ్లిందని ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. యువత కష్టపడి పరీక్షలు రాస్తే.. అవి లీక్‌(Paper Leak) అయ్యాయని.. దీంతో యువత నిరాశకు గురయ్యారని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు కూడా రక్షణ లేదని.. వారిపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని వివరించారు. ఎస్సీలు, పేదలు, బలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వంలో, ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగిందని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ(Rythu Runamafi) చేస్తామని చెప్పి.. పూర్తి చేయలేదని అన్నారు. కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన అన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ పూర్తయిందని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు - తెలంగాణను ఎలా ముందుకు నడిపించాలో కాంగ్రెస్‌కు తెలుసు : ప్రియాంక గాంధీ

"ప్రజల సంపద ప్రజలకే చెందాలనేది కాంగ్రెస్‌ ఆశయం. పేదలకు మేలు చేసేందుకు కాంగ్రెస్‌ 6 గ్యారంటీలు ప్రకటించింది. కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారంటీలను అమలు చేశాం. ఛత్తీస్‌గఢ్‌లో గెలిచిన మరుసటి రోజే రుణమాఫీ పూర్తి చేశాం. తెలంగాణలోనూ 6 గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తాం. అధికారంలోకి రాగానే ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.2500 వేస్తాం. పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు.. కాంగ్రెస్‌ గెలిస్తే రూ.500కే గ్యాస్‌ సిలిండర్ ఇస్తాం."- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు

Priyanka Gandhi Comments on BJP : ప్రధాని మోదీ(PM MODI) పాలనలో ధనికులకు తప్ప.. పేదలకు మేలు జరగలేదని ప్రియాంక గాంధీ అన్నారు. మోదీ దేశ సంపదనంతా అదానీకి అప్పగించారని.. ఇవాళ అదానీ రోజుకు రూ.1600 కోట్లు సంపాదిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌- బీఆర్ఎస్‌ మధ్యే ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఒప్పందం ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్‌, బీజేపీకి ఎంఐఎం సహకరిస్తోందని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసే ఎంఐఎం.. తెలంగాణలో 8 సీట్లలోనే ఎందుకు పరిమితమయిందని ప్రశ్నించారు.

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు కారణంగా రోడ్డు మార్గంలో చేరుకున్న ప్రియాంక రెండు సభల్లో పాల్గొన్నారు. మూడో సభలో హాజరయేందుకు సమయం సరిపోక ధర్మపురి సభను రద్దు చేసుకున్నారు. హుస్నాబాద్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.

Priyanka Gandhi Fires on BRS and BJP : 'బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్‌ మోదీ చేతిలో ఉంది'

Priyanka Gandhi Palamuru Tour Today : రాష్ట్రానికి మరోసారి ఏఐసీసీ అగ్రనేతలు.. కొల్లాపూర్​ సభలో నేడు ప్రియాంకా గాంధీ ప్రసంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.