ETV Bharat / state

మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలు సిద్ధం - Siddipet Municipal polling stations

సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయని అధికారులు వెల్లడించారు. 43వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను సిద్దిపేట అడిషనల్​ కలెక్టర్​, మున్సిపల్​ కమిషనర్ పరిశీలించారు.

సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్​కు సిద్ధం

author img

By

Published : Apr 28, 2021, 8:58 PM IST

సిద్దిపేట అడిషనల్​ కలెక్టర్​, మున్సిపల్​ కమిషనర్​ ఎన్నికలకు పోలింగ్​ కేంద్రాలు సిద్ధమని వెల్లడించారు. 43వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కరోనా దృష్ట్యా.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సోడియం హైపోక్లోరైడ్​తో పిచికారీ చేయించడం జరిగిందని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఉండాల్సిన కనీస వసతులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ల్యాంప్​, విద్యుత్​ సరఫరా ఓటు కేంద్రాల వద్ద రెండు వరుసల్లో వ్యక్తికి మధ్య సామాజిక దూరం ఉండేలా ముగ్గుతో వృత్తాలు గీయాలని అధికారులను ఆదేశించారు.

మాస్కు లేని వారికి పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద ఆశావర్కర్​లను నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మెడికల్ సిబ్బందిని సైతం నియమిస్తున్నామని ఏసీపీ తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి: కొవిడ్​ పోరులో 24x7 సహాయ చర్యలు: ఐఏఎఫ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.