సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం చేస్తూ... ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వాహక అధికారిగా విశ్వనాథ శర్మ... ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రంగారావు, సర్పంచి దేవసాని సుశీల రాజిరెడ్డి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. నేటి నుంచి ఆలయ నిర్వహణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుందని ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అర్చక సంఘం అధ్యక్షులు నర్సింహాచార్యులు, ప్రధానార్చకులు నర్సింహా మూర్తి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పౌరసత్వ రద్దుపై హైకోర్టుకు చెన్నమనేని రమేశ్