ETV Bharat / state

పదేళ్ల నిరుపేద చిన్నారికి ప్రాణాంతక క్యాన్సర్​ - CANCER

ఆడుతూ పాడుతూ... హాయిగా చదువుకుంటోంది. అనుకోకుండా ఒకరోజు కాలు జారికింద పడింది. అదే ఆ పాప పాలిట శాపమైంది. చిన్న దెబ్బతో వచ్చిన కంతి క్యాన్సర్​గా మారి పాప ప్రాణాలతో చెలగాటమాడుతోంది.

పదేళ్ల ప్రాయంలోనే నరకయాతన
author img

By

Published : Aug 30, 2019, 5:28 PM IST

పదేళ్ల ప్రాయంలోనే నరకయాతన

ఆడుతూ, పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ప్రాణాలతో పోరాడుతున్నది ఓ చిన్నారి. పదేళ్ల ప్రాయంలోనే ఎముకల వ్యాధితో నరకయాతన అనుభవిస్తోంది. చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా, అందంగా ఉన్న పాప... ఒకరోజు ఆడుకుంటూ జారి పడింది. తలకు, కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. వైద్యులకు చూపించినా లాభం లేకుండా పోయింది. కాలుకు వాపు వచ్చి ఆరు నెలల్లోనే విపరీతంగా ఉబ్బింది. కాలు నుంచి తలకు, అక్కడి నుంచి కాస్త దిగువకు విస్తరించి, చివరికి ఒక కన్ను పూర్తిగా మూసుకుపోయింది. తలకు ఏర్పడిన కంతి కాలక్రమేణా క్యాన్సర్​గా మారిందని వైద్యపరీక్షల్లో బయటపడింది.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేటకు చెందిన కిష్టయ్యది నిరుపేద కుటుంబం. భార్య లక్ష్మి బీడీ కార్మికురాలిగా పనిచేస్తుండగా... కిష్టయ్య కూలి పనిచేస్తున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని తమకు కన్నబిడ్డను బతికించుకోవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఇప్పటికే అప్పులు చేసి మరీ పాప వైద్యానికి 4 లక్షలకు పైగా ఖర్చుచేసినట్లు చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు. తినేందుకు తిండిలేక, పాపను బతికించుకునే స్థోమత లేక రోజూ నరకం అనుభవిస్తున్నమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పదేళ్ల ప్రాయంలోనే క్యాన్సర్​తో నరకం అనుభవిస్తున్న తమ కూతుర్ని కాపాడేందుకు దాతలు సాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: మరో 3రోజులు చిదంబరం కస్టడీ పొడిగింపు

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_71_30_ANDUKODI_SCRIPT_TS10058 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్: నిత్య వేదన నరక యాతన క్యాన్సర్తో పదేళ్ల బాలిక జీవన్మరణ పోరు ఎముకల వ్యాధి రూపంలో విధి విరుచుకుపడి వికృతంగా నర్తించి పసి బతుకును ఛిద్రం చేస్తోంది మనసు కలిగిన కళ్లు చెమర్చే అందుకనే చేతులనీ ఒక్కటి కావడమే మానవత బాలిక బతుకు భవితకు ఇదే భరోసా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో సిద్దన్నపేట గ్రామం రెక్కలు ముక్కలు చేసుకుంటే తప్ప పూటగడవని నిరుపేద కుటుంబం అమ్మ లక్ష్మి ఇంట్లోనే ఉంటూ బీడీలు చేస్తుంది నాన్న కిష్టయ్య కూలిపనికి దొరికితేనే కడుపు నిండుతుంది. ఆరో తరగతి చదువుతున్న బిడ్డ ఒక రోజున అనుకోకుండా జారి పడితేనే ఎంతో బాధ పడతాం అలాంటి వర్ష 14 సంవత్సరాలు బిడ్డ కోసం ఎముకల క్యాన్సర్ రావడం చాలా బాధకరమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టమని మా దగ్గర ఆర్థిక స్తోమత బాగాలేదని ఎవరైనా దాతలు వచ్చి ఆదుకోవాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంతి రూపాంతరం చెందింది వైద్య పరీక్షలలో ఈ వ్యాధి బయటపడిందని తల్లిదండ్రులు తెలిపారు.దినసరి కూలీ పనిచేసుకుంటూ ఉన్న ఇద్దరు పిల్లల్ని మంచిగా చదువించుకుంటూ ముందుకు పోతున్న ఒక పేద కుటుంబం దీన స్థితి ఇది.తండ్రి పెయింటింగ్ పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు, తల్లి ఇంట్లోనే ఉంటూ బీడీలు చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఈ సమయంలో చిన్నారికి ఈ రకమైన వ్యాధి సోకి పదేళ్ల వయసులోనే పడరాని నరకయాతన అనుభవిస్తున్న చిన్నారి వర్ష తండ్రి ఆవేదన . పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎటువంటి అనారోగ్యం అనేది లేకుండా పెరిగిన మా చిన్నారికి గత సంవత్సరం నుండి ఆరోగ్య సమస్యలు మొదలు అయ్యాయి. వైద్యం చేయించాము. ఆర్థిక స్తోమత అంతగా లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబం. బైట్: కిష్టయ్య తండ్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.