ETV Bharat / state

హామీలు గుర్తుకు రావాలంటే.. తెరాసను ఓడించాలి: ఉత్తమ్ - మాణిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ బూతు కమిటీల సమావేశం

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కేసీఆర్​కు గుర్తుకు రావాలంటే.. దుబ్బాకలో తెరాసను ఓడించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో భాగంగా... రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్​ అధ్వర్యంలో బూత్​ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.

pcc president utham kumar reddy meet with booth committees in dubbaka
హామీలు గుర్తుకు రావాలంటే.. తెరాసను ఓడించాలి: ఉత్తమ్
author img

By

Published : Oct 19, 2020, 11:43 PM IST

దుబ్బాక ఉపఎన్నికల నుంచే తెరాస పాలనకు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం మొదలైందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి అన్నారు. దౌల్తాబాద్, రాయపోల్ మండల కేంద్రాల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో బూత్​ కమిటీల సమావేశం ఏర్పాటు చేశారు.

గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బూత్​ కమిటీ సభ్యులకు ఉత్తమ్ నిర్దేశించారు. మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెడుతున్న తెరాసకు వ్యతిరేకంగా స్పందన వస్తోందన్నారు. హరీశ్ రావు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. దుబ్బాకలో కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్​ ఇచ్చిన హామీలు గుర్తుకు రావాలంటే.. దుబ్బాకలో తెరాసను ఓడించాలన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.