ETV Bharat / state

పరిహారం కోసం పరిణయాలు.. రాత్రికి రాత్రే ఇళ్ల నిర్మాణం - KCR

కాళేశ్వరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యేక ప్యాకేజీ వారిలో ఆశలు రేపింది. పరిహారం కోసం తమ కొడుకులకు ఆగమేఘాల మీద వివాహాలు జరిపించారు. మరికొందరు రాత్రికి రాత్రే ఇళ్లను నిర్మించారు. ఇంకొందరు సంవత్సరాల క్రితమే పెళ్లి చేసిన కూతుర్లను.. అవివాహితులుగా నమోదు చేపించారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో పరిహారం కోసం పడుతున్న పాట్లు.. చేస్తున్న ఫీట్లపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

పరిహారం కోసం పరిణయాలు.. రాత్రికి రాత్రే ఇళ్ల నిర్మాణం
author img

By

Published : May 20, 2019, 7:40 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్న మల్లన సాగర్ రిజ్వర్వాయర్​లో ఎనిమిది గ్రామాలు మునిగిపోతున్నాయి. ఈ గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వం ప్రత్యేకంగా పునరావాస, పునరోపాధి ప్యాకేజీలు అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి... ఏడున్నర లక్షల రూపాయల పరిహారం, 250 గజాల ఇంటి స్థలం, రెండు పడక గదుల ఇల్లు ఇస్తోంది. 18సంవత్సరాల వయసు దాటి పెళ్లి కాని యువతీ యువకులకు 5లక్షల పరిహారం, 250గజాల ఇంటి స్థలం ఇస్తోంది.

పరిహారం కోసం పరిణయాలు.. రాత్రికి రాత్రే ఇళ్ల నిర్మాణం

ఆగమేఘాల మీద పెళ్లిలు...

తమ కుమారుడికి పెళ్లి చేస్తే.. పునరావాస, పునరోపాధిలో అదనపు ప్రయోజనం పొందవచ్చన్న ఆశతో కొంత మంది తల్లిదండ్రులు తమ కొడుకులకు ఆగమేఘాల మీద పెళ్లిలు చేస్తున్నారు. రెండు మూడు సంవత్సరాల తర్వాత చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్లు కూడా... ఎలాగు ఊరు మునిగిపోతుంది.. అంతకంటే ముందే అయిన వాళ్లందరి సమక్షంలో పెళ్లి చేయాలన్న ఆలోచనతోనూ తమ కొడుకులకు వివాహలు చేశారు.

ప్రతి వీధిలోనూ పెళ్లి ఇళ్లే...

యువకుల కంటే పెళ్లైన వారికి సుమారు ఏడున్నర లక్షల రూపాయల అదనపు ప్రయోజనం లభిస్తుండటం వల్ల 21-23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువకుల్లో చాలా మందికి ఈ మధ్య కాలంలో వివాహాలు జరిగాయి. దాదాపు ప్రతి విధిలోనూ పెళ్లి ఇల్లు కనిపిస్తోంది. ప్యాకేజీని దృష్టిలో పెట్టుకుని సుమారు 100 వరకు వివాహాలు జరిగినట్లు అంచనా. అయితే కొంత మందికి మెండిచేయి ఎదురైంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 6 లోపు వివాహం చేసుకున్న వారినే అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇటీవల పెళ్లైన వారిని కూడా కుటుంబంగా గుర్తించి పూర్తి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

పరిహారం కోసం ప్లాన్​...

మరికొందరు పరిహారం కోసం తప్పుడు దారులు తొక్కుతున్నారు. రాత్రికి రాత్రే ఖాళీ స్థలాల్లో సిమెంటు ఇటుకలతో ఓ చిన్నపాటి గదితో ఇళ్లు నిర్మించారు. కొందరు సంవత్సరాల క్రితమే వివాహమైన తమ కూతుళ్లను అవివాహితులుగా పేర్లు నమోదు చేయించి.. పెళ్లి కానీ యువతకు ఇచ్చే 5లక్షల రూపాయల పరిహారం, 250 గజాల ఇంటి స్థలం తీసుకున్నారు.

స్థానిక రాజకీయ నాయకుల పాత్ర...

దశబ్దాల క్రితమే ఊరు విడిచి వెళ్లిన వారు కూడా గ్రామంలోనే ఉంటున్నారని.. స్థానిక రాజకీయ నాయకులు ఆధారాలు సృష్టించి పరిహారం ఇప్పించారు. ఇందుకోసం పరిహారంలో వాటా తీసుకుంటున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం రహస్యంగా దర్యాప్తు ప్రారంభించింది. ప్రాథమికంగా 250మంది నిబంధనలకు విరుద్ధంగా పరిహారం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

నిర్వాసితులకు పరిహారం ఇస్తున్న ప్రభుత్వం... అనర్హుల విషయంలో అంతే కఠినంగా వ్యవహరిస్తోంది.

ఇదీ చూడండి: 'మల్లన్న సాగర్ రైతులకు పరిహారం '

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.