రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కృషి చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్వీ సభ్యులు పాలాభిషేకం చేశారు. జిల్లాల పునర్విభజన చేపట్టి స్థానిక యువత 95 శాతం ఉద్యోగాలు పొందేలా సీఎం కృషి చేశారని సభ్యులు అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని సభ్యులు అన్నారు. ఆ సమస్య పునరావృతం కాకుండా కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.