సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం గంట పాటు వర్షం కురిసింది. పంటలు ఎండిపోతాయేమోనని బాధ పడుతున్న అన్నదాతల్లో ఆనందం వ్యక్తమైంది. హుస్నాబాద్‌లోని రోడ్లన్నీ జలమయమై, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లకు ఇరుప్రక్కల ఉన్న దుకాణాలలోకి వర్షపు నీరు చేరింది.
ఇవీ చూడండి:సచివాలయం కూల్చొద్దు: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు