ETV Bharat / state

New Groom Died Electric Shock in Siddipet : పెళ్లింట విషాదం.. కరెంట్​ షాక్​తో నవ వరుడు మృతి - Siddipet District Crime News

New Groom Died Electric Shock at Siddipet : పెళ్లి జరిగిన 24గంటల్లోనే నవ వరుణుడ్ని మృత్యువు కబలించింది. పెళ్లి జరిగిన ఆనందంతో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఆ యువకుడ్ని మృత్యువు కరెంట్​ షాక్​ రూపంలో పలకరించింది. దీంతో పెళ్లి భాజాలు మోగుతున్న ఇంట్లో చావు భజంత్రీలు మోగాయి. మాటలకు అందని ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Physics teacher died due to electric shock
New groom died to electric shock at Siddipet
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2023, 5:03 PM IST

Updated : Sep 4, 2023, 6:55 PM IST

Physics Teacher Died Electric Shock at Siddipet : పెళ్లికి వేసిన పందిరి ఇంకా తీయలేదు. మామిడి తోరణాలు ఇంకా వాడిపోనేలేదు. కాళ్లకు రాసిన పారణి ఇంకా అలానే ఉంది. బంధువులు వారి స్వస్థలాలకు ఇంకా చేరలేదు. డీజే పాటలకు డ్యాన్స్​లతో హోరెత్తించిన స్నేహితులు ఇంకా ఆ ఆనందంలోనే గడుపుతున్నారు. కోటి ఆశలతో.. కొండంతా బాధ్యతతో పెళ్లి చేసుకున్న ఆ నవ వరుడి ఆనందానికి అవధులు లేవు. తన జీవితంలోకి వచ్చిన భాగస్వామితో జీవితం ఎంత గొప్పగా తీర్చిదిద్దుకోవాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.

మృతుడు నిరంజన్​
New Groom Died Electric Shock at Siddipet

రోడ్డు దాటుతూ కరెంట్​ స్తంభాన్ని తాకి మహిళ మృతి.. విహార యాత్రకు వెళ్తుండగా ప్రమాదం..

New Groom Died due to Electric Shock : ఇంతలో పెండ్లి కుమారుడ్ని మృత్యువు కబలించడంతో ఇరు కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన 24 గంటలు కాక మునుపే నవ వరుడు మృతి చెందడంతో బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఎంతో ఇష్టపడి పెద్దల సమక్షంలో తాళి కట్టి.. ఏడు అడుగులు వేసిన భర్త మరణ వార్తతో నవ వధువు శోక సంద్రంలో మునిగిపోయింది. ఆమె ఏడ్చిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. అంతవరకు సంతోషంగా గడిపిన నూతన పెండ్లి కుమారుడు.. మృతితో గ్రామం ఒక్కసారిగా మూగబోయింది.

కరెంట్ షాక్​కు మూడు ఏనుగులు బలి.. అంత్యక్రియలు చేసిన గ్రామస్థులు

అసలు ఏం జరిగిందంటే..: సిద్దిపేట జిల్లా (Siddipet) వెంకటాపూర్ గ్రామంలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. పెళ్లయిన మరుసటి రోజే విద్యుత్ షాక్​తో వరుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా (Physics Teacher) పనిచేస్తున్న నిరంజన్.. శనివారం వివాహం చేసుకున్నాడు. బంధువులను, స్నేహితులను పిలిచి ఎంతో గ్రాండ్​గా వివాహం చేసుకున్నాడు.

ఈ క్రమంలో సోమవారం రిసెప్షన్​కు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఉదయం 4 గంటలకే నిద్ర లేచిన వరుడు.. రిసెప్షన్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు. ఈ నేపథ్యంలో ఫోన్ మాట్లాడుతూ మెడ పైకి వెళ్లాడు. ఇంతలో పెళ్లి కోసం ఇంటికి అలంకరించిన డెకరేషన్ లైటింగ్ వైరు తగిలి కరెంటు షాక్ (Electric Shock) గురై మరణించాడు. రిసెప్షన్ (Reception) రోజే పెళ్లి కుమారుడు చనిపోవడంతో ఇరు కుటుంబాలు తీవ్ర శోక సముద్రంలో మునిగారు.

Viral Video of Young Man Died Due to Electric Shock : పైపులను క్రేన్​ హుక్కుకు తగిలిస్తుండగా కరెంట్ షాక్.. వీడియో వైరల్

ఫిజిక్స్​ టీచర్​గా మంచి గుర్తింపు: మృతుడు నిరంజన్ సిద్ధిపేట పట్టణంలోనిఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్​ టీచర్​గా పని చేస్తున్నాడు. స్కూల్​లో మంచి టీచర్​గా పేరు సంపాదించుకున్నాడు. అలాగే గ్రామంలో మంచి యువకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో శనివారం పెళ్లి పీటలెక్కాడు. ఇంతలో నిరంజన్​ మృతి చెందడంతో గ్రామంలో యువకులతో పాటు స్కూల్​ విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు కన్నీంటి పర్యంతమవుతున్నారు.

Auto Driver Killed by Falling Tree Live Video : ఆటోలపై కుప్పకూలిన భారీ వృక్షం.. డ్రైవర్‌ మృతి

Jagtial Deepthi Murder Case Update : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి మర్డర్​ కేసు.. పోలీసుల అదుపులో చందన..?

Last Updated : Sep 4, 2023, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.