ETV Bharat / state

సర్కిల్ ఇన్స్​పెక్టర్ కార్యాలయం ప్రారంభం - ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నూతన సర్కిల్​ ఇన్​స్పెక్టర్​ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, సీపీ జోయల్​ డేవిస్​ ప్రారంభించారు. అనంతరం స్టేషన్​ ఆవరణలో మొక్కలు నాటారు.

దుబ్బాకలో నూతన సీఐ కార్యాలయం ప్రారంభం
author img

By

Published : Aug 26, 2019, 6:12 PM IST

దుబ్బాకలో నూతన సీఐ కార్యాలయం ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పోలీస్​ స్టేషన్​లను డిజిటలైజ్​ చేస్తూ, ఆఫీసర్లకు ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేస్తోందని సిద్దిపేట సీపీ జోయల్​ డేవిస్​ అన్నారు. దుబ్బాకలో సీఐ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి ప్రారంభించారు. పోలీస్​ ఆఫీసర్లకు కార్యాలయాలు ఎంతో ముఖ్యమని సీపీ చెప్పారు. ప్రజలు వారి సమస్యలను ప్రత్యక్షంగా కార్యాలయాలకు వచ్చి తెలిపేందుకు ఇదెందో అవసరమని తెలిపారు. దుబ్బాక సర్కిల్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రిస్తున్నామని వెల్లడించారు.

దుబ్బాకలో నూతన సీఐ కార్యాలయం ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పోలీస్​ స్టేషన్​లను డిజిటలైజ్​ చేస్తూ, ఆఫీసర్లకు ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేస్తోందని సిద్దిపేట సీపీ జోయల్​ డేవిస్​ అన్నారు. దుబ్బాకలో సీఐ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి ప్రారంభించారు. పోలీస్​ ఆఫీసర్లకు కార్యాలయాలు ఎంతో ముఖ్యమని సీపీ చెప్పారు. ప్రజలు వారి సమస్యలను ప్రత్యక్షంగా కార్యాలయాలకు వచ్చి తెలిపేందుకు ఇదెందో అవసరమని తెలిపారు. దుబ్బాక సర్కిల్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రిస్తున్నామని వెల్లడించారు.

Intro:నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి, సిద్దిపేట సిపి జోయల్ డేవిస్.


Body:సిద్దిపేట జిల్లా మున్సిపాలిటీ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరియు సిద్దిపేట జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్ ప్రారంభించారు.
సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం చాంబర్లో పూజలు నిర్వహించారు, అనంతరం ఎమ్మెల్యే రామలింగారెడ్డి కార్యాలయం రిజిస్టర్లో వారి అమూల్యమైన సందేశాన్ని రాసి సంతకం చేశారు.
పోలీస్ స్టేషన్ ఆవరణలో సిపి జోయల్ డేవిస్ మొక్కలు నాటారు.

కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్ మాట్లాడుతూ పోలీస్ ఆఫీసర్లకు కార్యాలయాలు ఎంతో ముఖ్యమని, ప్రజలు ప్రజా సమస్యలను ఆటంకం లేకుండా ప్రత్యక్షంగా కార్యాలయాలకు వచ్చి వారి సమస్యలను తెలుపుతారని, అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పోలీస్ స్టేషన్ లను డిజిటలైజేషన్ చేస్తూ, ఆఫీసులకు ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు అని ప్రస్తుతం రాష్ట్రంలోని హైదరాబాదులో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయిందని, మన సిద్దిపేట జిల్లాలో మొత్తం 14 పోలీస్ స్టేషన్లను పోలీస్ ఆఫీసర్ కార్యాలయాల కోసం ఎంచుకోవడం జరిగింది అని, ఈరోజు దుబ్బాకలో సి ఐ ఆఫీసు ప్రారంభించడం జరిగింది అని అన్నారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వారి సహాయంతో ఈ సర్కిల్ ఆఫీస్ లను నిర్మించడం జరుగుతుంది అని అన్నారు,

దుబ్బాక సర్కిల్లో నేరాల నియంత్రణ బాగుందని అందులో భాగంగా అన్ని గ్రామాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం అయిందని, ఇంకా 6 గ్రామాలలో ఏర్పాటు చేయవలసి ఉంది అని అన్నారు.


Conclusion:ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరియు సిద్దిపేట సిపి జోయల్ డేవిస్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఈ ఈ సుధాకర్, సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని సిఐలు, ఎస్సైలు మరియు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
దుబ్బాక జడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి,ఎంపీపీ పుష్పలత, దుబ్బాక నియోజకవర్గ టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

కిట్ నంబర్:1272, బిక్షపతి, దుబ్బాక.
9347734523.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.