ETV Bharat / state

తండ్రికి తిండి పెట్టని తనయులు.. అరెస్ట్ చేసిన పోలీసులు.. - తండ్రికి తిండి పెట్టని తనయుల అరెస్టు

రక్తం పంచుకు పుట్టిన కుమారులు అన్నం పెట్టకుండా కన్నతండ్రిని బజారుపాలు చేశారు. రూ.3 కోట్ల విలువైన ఆస్తులు పంచి ఇచ్చినా అన్నం పెట్టకుండా కన్నీరు పెట్టించిన ఘటనపై వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన కోహెడ ఎస్సై ముగ్గురు కుమారులను బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచారు. వారిని మేజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించారు.

సిద్దిపేట ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య తండ్రి

author img

By

Published : Aug 6, 2020, 1:47 PM IST

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం పరిధి శంకర్‌నగర్‌కు చెందిన పోతు మల్లయ్య(79)కు రవీందర్‌, జనార్దన్‌, రవీందర్‌ సంతానం. తండ్రి మల్లయ్య వారికి రూ.కోటి చొప్పున ఆస్తి పంచి ఇచ్చాడు. అయినా ఆయన్ను పోషించడానికి వారిలో ఒకరూ ముందుకు రాలేదు. గ్రామ పెద్దలు పరిపరి విధాలుగా చెప్పినా, కోహెడ ఠాణాకు పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చినా.. ఆర్డీవో చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో మల్లయ్య ఏడాదిగా గ్రామ ప్రజలు పెట్టింది తింటూ కాలం వెళ్లదీస్తున్నారు.

నెలరోజుల క్రితం కోహెడ ఎస్సై రాజ్​ కుమార్‌, గ్రామపెద్దలతో కలిసి ఆయనను చిన్నకోడూరు మండలం అంకిరెడ్డిపల్లి గ్రామ శివారులోని వృద్ధాశ్రమంలో చేర్పించారు. అక్కడ చేరిన తరువాత అనారోగ్యంతో బాధపడుతుండగా ఆశ్రమ నిర్వాహకులు ఆయన్ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్నారు.

ఎస్సై రాజ్​ కుమార్‌.. కుమారులకు సమాచారం ఇవ్వగా ఒక్కరూ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో కన్నతండ్రిని పట్టించుకోని కుమారులపై శనిగరం వీఆర్వో ఫిర్యాదు చేయగా బుధవారం ఎస్సై రాజ్‌కుమార్‌ ముగ్గురు కుమారులపై కేసు నమోదు చేసి హుస్నాబాద్‌ కోర్టులో హాజరు పరచారు. మెజిస్ట్రేట్‌ వారికి రిమాండు విధించారు.

ఇదీ చూడండి : పరిశ్రమల్లో అత్యధిక ఉద్యోగాలు స్థానికులకే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.