రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సిద్దిపేటలో భాజపా నాయకులు నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. వేములవాడ కమాన్ నుంచి ప్రారంభమై అంబేడ్కర్ కూడలి మీదుగా రంగదాంపల్లి చౌరస్తా వరకు కొనసాగింది. రంగదాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్థూపం వద్ద అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎందరో ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని ఎంపీ సంజయ్‌కుమార్ అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే నిజాం సమాధి వద్దకు సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లాడో చెప్పాలని ప్రశ్నించారు. నిజాం కుటుంబానికి కేసీఆర్‌కు ఉన్న లోపాయకారి ఒప్పందం ఏంటని సంజయ్‌కుమార్ నిలదీశారు.
ఇవీ చూడండి: తెలంగాణ విమోచన దినోత్సవం వెనకున్న చరిత్ర ఇదే!!