ETV Bharat / state

'దుబ్బాక ఉపఎన్నికల్లో భాజపా గెలుపుకు కృషి చేయాలి'

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం ఉపఎన్నికల్లో భాజపా గెలుపు కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కుమార్​ అసెంబ్లీ, మండలాలకు ఇంఛార్జ్​లను నియమించారు. ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కమలం శ్రేణులు కృషి చేయాలని బండి సంజయ్​ సూచించారు.

mp bandi sanjay decided bjp committee regarding dubbaka elections in siddipet district
'దుబ్బాక ఉపఎన్నికల్లో భాజపా గెలుపుకు కృషి చేయాలి'
author img

By

Published : Sep 25, 2020, 7:57 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం ఉపఎన్నికల్లో భాజపా గెలుపు కోసం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అసెంబ్లీ, మండలాలకు బాధ్యులను నియమించారు. అసెంబ్లీ ఇన్​ఛార్జిగా మాజీ ఎంపీ జితేందర్​రెడ్డిని ప్రకటించారు. దుబ్బాక గ్రామీణానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి, దుబ్బాక అర్బన్​కు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణను నియమించారు.

మిరుదొడ్డి మండలానికి మాజీ ఎంపీ సురేష్​రెడ్డి, తొగుట మండలానికి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, దౌల్తాబాద్​ మండలానికి మాజీ ఎమ్మెల్యే శశిధర్​రెడ్డి, రాయప్రోలు మండలానికి మాజీ ఎమ్మెల్యే యం.విజయ్​పాల్ ​రెడ్డి, చేగుంట మండలానికి మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు, నార్సింగ్​ మండలానికి మాజీ ఎమ్మెల్యే విజయరామారావును నియమించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రచారం నిర్వహించనున్నారు.

ఇదీ చదవండిః దుబ్బాక ఉప ఎన్నికపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.