సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన దొమ్మాట ప్రత్యుష (21)కు నెలలు నిండాయి. ఆ సమయంలోనే ఆమెతో పాటు భర్త భరత్, మామయ్య రాజయ్యలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వారం రోజులుగా వారంతా ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటున్నారు.
ప్రసవ సమయం సమీపించటంతో తిమ్మాపూర్ వైద్యుల సూచన మేరకు మంగళవారం ప్రత్యూషను హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె అర్ధరాత్రి బాబుకి జన్మనిచ్చింది. అనంతరం శ్వాస సంబంధ సమస్య తలెత్తడంతో సికింద్రాబాద్‌లోని గాంధీకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందింది.
కన్నబిడ్డను చూడకుండానే తల్లి మృతి చెందడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. శిశువును నిలోఫర్‌లోని న్యూయోనాటల్ కేర్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
ఇదీ చూడండి: వైద్యులు లేకుండానే వైద్యం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం