వానరాలకు కష్టం వచ్చింది. అప్పటి వరకూ తమతో ఎగురుతూ.. సరదా పట్టిస్తూ తిరిగిన నేస్తం ఎందుకో ఏమైందో కానీ హఠాత్తుగా ఎవరో కొట్టినట్టుగా నేలపై కరుచుకు పడింది. ఇక లేవలేదు. ఎంతో కాలం పాటు పడిపోయిన వానరాన్ని లేపడానికి ఎంతగానో తండ్లాడాయి. ఫలితం దక్కలేదు. పాపం.. ఆ వానరాలకేం తెలుసు! నేస్తం గెంతుతూ ఉండగా విద్యుత్తు స్తంభానికి ఉన్న ఒక తీగ తగిలి విద్యుదాఘాతమైందని. చాలాసేపు చనిపోయిన వానరం వద్దే తచ్చాడిన ఆవేదనాభరిత ఘటన సిద్దిపేట ఆంధ్రాబ్యాంక్ సమీపంలో జరిగింది.
ఇవీ చూడండి: ‘జొమాటో, స్విగ్గీ’తో కూరగాయల సరఫరా!