సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఈసారి నిరాడంబరంగా జరిగాయి. తొమ్మిది రోజులుగా తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించి వేడుకలు నిర్వహించుకున్న మహిళలు.. చివరి రోజైన నేడు సద్దుల బతుకమ్మను రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. నూతన వస్త్రాలు ధరించి.. బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం స్థానిక ఎల్లమ్మ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
![Modest Saddula Bathukamma celebrations in Husnabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-102-24-saddula-bathukamma-av-ts10085_24102020213456_2410f_1603555496_1051.jpg)
కరోనా నేపథ్యంలో హుస్నాబాద్ మున్సిపాలిటీ పాలక వర్గం ఆదేశాల మేరకు ఈసారి ఎవరిళ్ల వద్ద వారే బతుకమ్మ సంబురాలు నిర్వహించుకున్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మలతో కిక్కిరిసిపోయే ఎల్లమ్మ చెరువు కట్ట ప్రాంతం.. ఈసారి వెలవెలబోయింది. నిమజ్జనం సందర్భంగా సైతం మహిళలు ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించారు.
ఇదీ చూడండి.. ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ఆడిపాడిన మహిళలు