అనుమతి నిరాకరణ
4 గంటల తరువాత పట్టభద్రులకు పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేకపోవటంతో వచ్చిన వారిని భద్రతా సిబ్బంది గేటు బయటే నిలువరించారు. ఆగ్రహించిన ఓటర్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న హుస్నాబాద్ ఎస్సై సుధాకర్ వారితో మాట్లాడి సర్దిచెప్పి పంపించారు.
ఓటర్ స్లిప్పై 5 గంటల వరకు
ఆలస్యంగా వచ్చిన పట్టభద్రులు తమకు ఇచ్చిన ఓటర్ స్లిప్‌లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉందని స్లిప్‌లను చూపించారు. ఇంకా సమయం ఉందని వచ్చామని... ఇక్కడికి వస్తే 4 గంటల వరకే అంటూ పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని వాపోయారు. ఓటు హక్కు వినియోగించుకోలేక నిరాశతో వెనుదిరిగారు.
ఇవీ చూడండి:రైళ్లో తప్పిపోయిన పాప... శిశువిహార్‌కు తరలింపు