సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలో మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు మార్కెటింగ్ సహాయం, 100 శాతం సబ్సిడీతో రూ. 48 లక్షల చెక్కులను దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అందజేశారు. కేసీఆర్ ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో చేపపిల్లలను అందిస్తున్నారని తెలిపారు. త్వరలోనే కూడవెల్లి వాగులో 26 చెక్ డ్యామ్‌లకు చేపపిల్లలను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో మత్సకారులు అభివృద్ధి తెరాసతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, డీసీఎం ఎస్.డైరెక్టర్ గుండెబోయిన వెంకటేశ్వర్లు, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల మహిళలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కాంగ్రెస్, భాజపా నాయకుల మధ్య తోపులాట