కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నిర్వహిస్తున్న గాంధీ సంకల్పయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండోరోజు పాదయాత్రలో భాగంగా జిల్లాలోని జమ్మికుంట జంక్షన్ కూడలి వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసే సమయంలో యాత్రను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకొనే యత్నం చేశారు. గాడ్సే భక్తులు అయిన భాజపా నాయకులు గాంధీజీ పేరుతో సంకల్పయాత్ర చేయడమేంటని ప్రశ్నించారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేయొద్దని నినాదాలు చేస్తున్న క్రమంలో కాంగ్రెస్, భాజపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరుపార్టీల కార్యర్తలకు నచ్చ చెప్పే యత్నం చేశారు. దీనితో ఎంపీ బండి సంజయ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంట సేపటి నుంచి యాత్రను అడ్డుకుంటున్నప్పటికి పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలీసులు కేవలం టీఆర్‌ఎస్ కార్యకర్తల కోసమే పనిచేస్తారా అంటూ వాగ్వాదానికి దిగారు. తెరాస, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయి... దాడికి తెగబడ్డాయని ఎంపీ సంజయ్ ధ్వజమెత్తారు. ఇది పూర్తిగా శాంంతి భద్రతల వైఫల్యమేనని తేల్చి చెప్పారు. తాను శాంతియుత మార్గంలో గాంధేయ పద్ధతిలో పాదయాత్ర నిర్వహిస్తున్నానని... తనకు పోలీసు భద్రత అవసరం లేదని స్పష్టం చేశారు.
ఈ కథనం చదవండి: నేరాలు-ఘోరాల్లో తెలుగు రాష్ట్రాల వాటా 8.2 శాతం