సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పేద రైతు కుటుంబ సభ్యులకు రైతు బీమా ప్రొసీడింగ్స్‌ను ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అందేజేశారు. తిమ్మాపూర్‌కు చెందిన రామవరం బాల్‌రెడ్డి, జోరబొంతల బాబు అనే ఇద్దరు రైతులు అనారోగ్యంతో మరణించగా... మంజూరైన రైతు బీమా ప్రొసీడింగ్స్ కాపీలను కుటుంబసభ్యులకు అందించారు.
పెద్దగుండవెల్లికి చెందిన మల్లయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు తౌడ శ్రీనివాస్, ఏఎంసీ వైస్ ఛైర్మన్ పండరి రాజా లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.