పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సతీష్‌కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పట్టణంలోని 20 వార్డులకు చెందిన కౌన్సిలర్లు.. వారి వారి వార్డులకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజలు కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవడంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ 10 రోజుల కార్యక్రమంలో ఏ క్షణమైనా ఏ పట్టణంలో అయినా మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేస్తారని అందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.