సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని 29 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే సతీష్ కుమార్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పథకాలు చేపడుతోందన్నారు.
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఆర్థికసాయం అందిస్తూ పేదల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.