MLA Harishrao on Handicap Pensions : దివ్యాంగులు వయస్సులో ఎంత పెద్దవారైనా చిన్న పిల్లలతో సమానమని మాజీ మంత్రి హారీశ్ రావు(Harish rao) పేర్కొన్నారు. మానవసేవే మాధవ సేవ అని, ఇలాంటి వారికి సేవ చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సిద్ధిపేట లయన్స్ క్లబ్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభయ జ్యోతి ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రారంభించారు.
హరీశ్‌రావు వర్సెస్ రాజగోపాల్‌రెడ్డి - అధికార పదవులపై సభలో రభస
ఈ సందర్బంగా హరీశ్‌రావు మాట్లాడుతూ దివ్యాంగులకు అండగా ఉన్న నాయకుడు కేసీఆర్(KCR) అని అన్నారు. దివ్యాంగుల పట్ల మానవతా హృదయాన్ని చాటుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడ లేని విధంగా నెలకు 4వేల రూపాయల పెన్షన్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలలో 1500రూపాయల కంటే ఎక్కువగా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.
MLA Harishrao in Abhaya Jyothi Programme : అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్(Congress) దివ్యాంగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా దివ్యాంగులకు 6000 రూపాయల పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేసి దివ్యాంగులకు ఆసరాగా నిలవాలన్నారు. దివ్యాంగుల పక్షాల ప్రభుత్వాన్ని అడుగుతున్నట్లు పేర్కొన్నారు.
మానసిక దివ్యాంగులు, విధివంచితులైనవారు తమ పనులు తాము చేసుకోలేరని వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. మానసిక వికలాంగులు వయసులో ఎంత పెద్దవాళ్ళు అయిన చిన్న పిల్లలతో సమానమన్నారు. కొంతమంది వారి పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తారని, అలాంటి వారు తన దృష్టిలో మనుషులు కాదని మండిపడ్డారు. మానసిక వికలాంగులకు సహాయం కోసం తన వంతు సహాకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
పేద ప్రజల కంటి సమస్యలకు పరిష్కారం అయ్యేలా సిద్దిపేటలోనే ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిని రూ.6 కోట్లతో ఏర్పాటు చేసినట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. కంటి ఆపరేషన్లు, కంటి సమస్యలకు ఎంత గానో మేలు జరుగుతుందన్నారు. ప్రజలు ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిద్దిపేటలో అభయ జ్యోతి, లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని కరోనా సమయంలోనూ ఎంతగానో సేవలు చేసారన్నారు.
"రాష్ట్రంలో దివ్యాంగులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పింఛన్ అందజేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దివ్యాంగులకు రూ.4000ల ఆసరా పింఛన్‌ను అందించాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్ ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది". - హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
హరీశ్‌రావు వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - మోటార్లకు మీటర్ల విషయంలో మాటల యుద్ధం