సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 13వ వార్డులో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యటించారు.వార్డులోని పలు ఇళ్లలో నీళ్ళు నిల్వ ఉంచుకునే ట్యాంకులను శుభ్రం చేయించారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుని రోగాలు దరిచేరనివ్వొద్దని సూచించారు.
రోజుల తరబడి నీటిని నిల్వ ఉంచకూడదని వార్డులోని ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు 13వ వార్డు కౌన్సిలర్ ఆశా సులోచన, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.