Cultivation Of Monsoon Crops: రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిన రాష్ట్రంగా... తెలంగాణ నిలిచిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇది తాము చెబుతున్న విషయం కాదని... పార్లమెంట్ వేదికగా కేంద్రమే వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో సిద్దిపేట, మెదక్ జిల్లాల వానాకాలం సాగు సన్నాహక సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు. రైతుబీమా పథకం దేశానికే ఆదర్శనంగా నిలుస్తుందన్న హరీశ్‌రావు.. బావులకు మీటర్లు పెట్టేందుకు రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకోంటోందని ఆరోపించారు. భాజపా పాలిత ప్రాంతాల్లో రైతుబంధును అమలు చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు.
పాలకులు తీసుకున్న నిర్ణయాలను బట్టే సమాజం పోకడ ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయం ద్వారానే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందని... అందుకే కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, రసమయి బాలకిషన్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతుబంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాశ్ రెడ్డి లతోపాటు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారా? రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ 24 గంటలు సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలో అతి తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేసే జిల్లా సంగారెడ్డి. పచ్చి రొట్ట పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి. గత ప్రభుత్వాలు వ్యవసాయం గురించి పట్టించుకోలేదు. కేసీఆర్ వ్యవసాయం, సాగునీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి అర్ధరాత్రి విద్యుత్ వచ్చేది. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న భాజపా.. పెట్టుబడి వ్యయం రెట్టింపు చేసింది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం మెడ మీద కత్తి పెట్టింది. రూ.5వేల కోట్లు ఇస్తామన్నా.. రైతుల ప్రయోజనాల కోసం కేసీఆర్ ఒప్పుకోలేదు. -- హరీశ్‌రావు, మంత్రి
రాష్ట్ర అవసరాలకు అలుగడ్డ కావాలంటే 2.5లక్షల ఎకరాల్లో పండించాలి. దిగుమతులు తగ్గించుకొని ఇతర రాష్ట్రాలకు ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేయాలి. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా ప్రణాళికలు చెయ్యాలి. సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో రైతులు విభిన్న పంటలు పండిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భూములు నిస్సారంగా మారుతున్నాయి. చైనాలో వరి ఎకరాకు 100క్వింటాలు పండుతుంటే ఇక్కడ 40 క్వింటాలు దాటడం లేదు. రూ.3.75లక్షల కోట్లు వ్యవసాయానికి ప్రభుత్వం ఖర్చు చేసింది. రూ.50 వేల కోట్లు రైతు బంధు కోసం ఖర్చు చేశాం. -- నిరంజన్‌రెడ్డి, మంత్రి
ఇవీ చూడండి: