దుబ్బాక ఉప ఎన్నికలో ప్రజలు భాజపాకు పట్టం కట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెరాస పరిపాలన పట్ల ప్రజలు విసిగిపోయినట్లు నిరూపితమైందన్నారు. దుబ్బాక యువత పోరాటం వల్లే భాజపా విజయం సాధించిందని వివరించారు. అన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో భాజపాను స్వాగతించారని తెలిపారు.
దుబ్బాకలో అధికార పార్టీ దౌర్జన్యాలను ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. కొవిడ్, వరదలు వంటి విపత్తుల వేళ కేంద్రం ప్రజలకు అండగా నిలిచిందన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న రాష్ట్ర సర్కారు కొవిడ్ వేళ ప్రజలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. దురుద్దేశంతోనే వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఇదీ చదవండి: ఈ విజయం దుబ్బాక ప్రజలకు అంకితం: రఘునందన్