ETV Bharat / state

'ప్లాస్టిక్​ రహిత పర్యావరణాన్ని నెలకొల్పేందుకు ప్రజలు సహకరించాలి'

సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీశ్​రావు పర్యటించారు. ప్లాస్టిక్​ వాడకానికి ప్రత్యామ్నాయంగా పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన స్టీల్​ బ్యాంకులను మంత్రి ప్రారంభించారు. అనంతరం సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

minister harishrao started steal banks in siddipet
'ప్లాస్టిక్​ రహిత పర్యావరణాన్ని నెలకొల్పేందుకు ప్రజలు సహకరించాలి'
author img

By

Published : Jul 22, 2020, 5:55 PM IST

సిద్దిపేటలో ప్లాస్టిక్​ రహిత పర్యావరణాన్ని నెలకొల్పేందుకు ప్రజలు సహకరించాలని ఆర్థిక మంత్రి హరీశ్​రావు కోరారు. పట్టణంలో పర్యటించిన మంత్రి... 24, 27, 29 వార్డుల్లో స్టీల్​ బ్యాంకులను ప్రారంభించారు. అనంతరం సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్లాస్టిక్ వాడకానికి ప్రత్యామ్నాయంగా స్టీల్ బ్యాంక్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు హరీశ్​రావు తెలిపారు.

ప్రజలు స్టీల్ బ్యాంకును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విందులు, వినోదాలు, ఇంటి దగ్గర ఎలాంటి కార్యక్రమం జరిగినా... స్టీల్ బ్యాంక్​ను ఉపయోగించుకోవాలని తెలిపారు. వార్డుల్లోని ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాలని కౌన్సిలర్లు, మెప్మా ఆర్పీలను మంత్రి ఆదేశించారు.

ఇదీ చూడండి: గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్​ఐఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.