కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ... నిబంధనలు పాటించాలని కోరారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలలుగా మూసి ఉన్న కోమటి చెరువు ట్యాంక్‌బండ్‌ను మంగళవారం తిరిగి ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇక నుంచి యథావిధిగా మినీ ట్యాంకు బండ్‌కు సందర్శకులు రావొచ్చని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి కోరారు.
కోమటి చెరువు చుట్టూ మంత్రి గంటన్నర పాటు కలియతిరిగారు. మత్తడి పోస్తున్న చెరువు ప్రాంతాన్ని పరిశీలించి కలర్ ఫుల్ లైటింగ్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు మహేశ్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.