ETV Bharat / state

'ఆరోగ్య తెలంగాణ... ప్రజల చేతిలోనే ఉంది' - ఆర్థిక మంత్రి హరీశ్​ రావు

ఆర్థిక మంత్రి హరీశ్​ రావు మరోసారి మాస్టర్​ అవతారం ఎత్తారు. సిద్దిపేట జిల్లా వెంకటాపూర్​లో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన మంత్రి... బుస్సాపూర్​ జిల్లా పరిషత్​ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులను ప్రశ్నలు అడిగారు.

minister harish rao visit to venkatapur in siddipet district
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి
author img

By

Published : Jan 7, 2020, 5:48 PM IST

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి

ఆరోగ్య తెలంగాణ ప్రజల సాయంతోనే సాకారమవుతుందని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా వెంకటాపూర్​లో రెండో విడత పల్లె ప్రగతిలో పాల్గొన్నారు.

గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన మంత్రి... జ్వరాలు లేని ఆరోగ్య వెంకటాపూర్​, ఆరోగ్య సిద్దిపేట, ఆరోగ్య తెలంగాణ ప్రజల చేతిలోనే ఉందని పేర్కొన్నారు.

అనంతరం బుస్సాపూర్​ గ్రామానికి చేరుకున్న మంత్రి... జిల్లా పరిషత్​ పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు.

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి

ఆరోగ్య తెలంగాణ ప్రజల సాయంతోనే సాకారమవుతుందని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా వెంకటాపూర్​లో రెండో విడత పల్లె ప్రగతిలో పాల్గొన్నారు.

గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన మంత్రి... జ్వరాలు లేని ఆరోగ్య వెంకటాపూర్​, ఆరోగ్య సిద్దిపేట, ఆరోగ్య తెలంగాణ ప్రజల చేతిలోనే ఉందని పేర్కొన్నారు.

అనంతరం బుస్సాపూర్​ గ్రామానికి చేరుకున్న మంత్రి... జిల్లా పరిషత్​ పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు.

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_71_07_HARISH PARYATANA_SCRIPT_TS10058 సెంటర్:సిద్దిపేట సిద్దిపేట యాంకర్: జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రూరల్ మండలం వెంకటాపూర్‌ గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరైన ఆర్థిక మంత్రి హరీశ్ రావు, మంత్రికి బోనాలు, డప్పుచప్పుళ్ళు, కుంకుమ తిలకం దిద్ది ఘనంగా‌ స్వాగతం పలికిన వెంకటాపూర్ గ్రామస్థులు. ఈ మేరకు తరిగొప్పుల మల్లేశం-పుష్ప, యాదయ్య-సుశీల ఇండ్లలో రెండవ విడత పల్లె ప్రగతిలో భాగంగా చెత్త చెదారం పరిశీలించి వీలైనంత పరిశుభ్రంగా ఇళ్లు నిలుపుకోవాలని, పాత సామాన్లు, ఇంట్లో ఉన్న పాత చెత్త చెదారం తొలగించాలని కోరారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.... 120 ట్రాక్టర్ల చెత్తను ఒకేరోజు తీసివేశారు. వెంకటాపూర్ గ్రామం శుభ్రంగా ఉంది. ఊరికి వచ్చే దారిలో పచ్చని చెట్లు కనపడ్డాయి. ప్రతి ఇంటింటికీ త్వరలోనే రెండు చెత్త డబ్బాలు పంపిణీ చేయిస్తా.మన ఊరు మనం పరిశుభ్రంగా నిలుపుకోవాలి. ఇళ్లు కూడా శుభ్రంగా నిలుపుకోవాలి. పనికి రాని చెత్త ఇంట్లో పెట్టుకోవద్దు. చెత్త ఉంటే ఇంట్లో బయట దోమలు పెరుగుతాయని, రెండవ విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలోని ఇళ్లలోంచి 100 ట్రాక్టర్లు చెత్త బయటకు వచ్చిందని, ఇదే పద్ధతిని నిరంతరం కొనసాగించాలని గ్రామస్తులను కోరారు. జ్వరాలు లేని ఆరోగ్య వెంకటాపూర్, ఆరోగ్య సిద్ధిపేట నియోజకవర్గం, ఆరోగ్య తెలంగాణ కావాలని ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్, బ్లేడ్ కొని ఇస్తాం. గ్రామాన్ని పరిశుభ్రంగా నిలపాలి. రెండు బుట్టలలో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి ఇవ్వాలి. మోరీల్లో ప్లాస్టిక్ గ్లాసులు, పనికి రాని చెత్త వేయవద్దు. దోమలు, ఈగలు మన ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్త వహించండి. 2వేల పింఛన్ చేశామని, 50 వేల నుంచి లక్షా 116 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేరిట ఇస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తెచ్చి పేదల ప్రభుత్వంగా మారిందని చెప్పారు. అనంతరం సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామంలో 2 వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి హరీష్ రావు, గ్రామంలోనీ జిల్లా పరిషత్ పాటశాలను సందర్శించి పదవ తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నా మంత్రి. బైట్:ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.