సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పొరెడ్డిపల్లిలో ఇటీవల నిర్మించిన చెక్‌డ్యాం జలకళ సంతరించుకుంది. 13 కోట్లతో వంతెనతో కూడిన చెక్ డ్యాంను నిర్మించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో పూర్తిగా నిండింది. ఆర్థికమంత్రి హరీశ్‌రావు సందర్శించి పూజలు నిర్వహించారు. పూర్తిగా నిండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జనతో' గీతం అద్భుతం: గవర్నర్ తమిళి సై