తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రొఫెసర్ జయశంకర్(PROFESSOR JAYASHANKAR) జీవితాంతం పాటుపడ్డారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు(HARISH RAO) అన్నారు. రాష్ట్ర ఏర్పాటే ఏకైక అజెండాగా తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు(BIRTH ANNIVERSARY) సిద్దిపేటలో ఘనంగా జరిగాయి. జిల్లాకేంద్రంలోని ముస్తాబాద్ సర్కిల్‌లోని ఆయన విగ్రహానికి హరీశ్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆయన ఆశయ సాధన కోసం తెరాస ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలుగా మారాయని... ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.
సార్ తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ అగ్రభాగాన నిలవడానికి ఎంతో కృషి చేశారు. నడుస్తున్న తెలంగాణ చారిత్రక గ్రంథంగా ఆయన ఉండేవారు. సార్ జీవితం యువతకు ఆదర్శం, స్ఫూర్తిదాయకం. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి.
-హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి
ఇదీ చదవండి: Dial 112: అత్యవసర ఫిర్యాదులకు దేశవ్యాప్తంగా ఒకటే నంబర్