ETV Bharat / state

'శంకరయ్యను ఆదర్శంగా తీసుకోండయ్యా' - siddipeta district

సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో మంత్రి హరీశ్​రావు పర్యటించారు. జిల్లాకు గోదావరి జలాలు వచ్చిన నేపథ్యంలో రైతులకు పలు సూచనలు చేశారు.

minister harish rao toured in chinnakoduru
ఇక నుంచి ఆరుతడి పంటలు పండించండి: హరీశ్​రావు
author img

By

Published : May 5, 2020, 9:54 AM IST

జిల్లాలో రైతులు ఇక నుంచి ఆరుతడి పంటలు పండించి లాభాలు పొందాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్​ మండలంలోని విఠలాపూర్​ గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ శివారు ప్రధాన ఎడమ కాల్వ సమీపంలో ఆరుతడి పంటలు పండిస్తున్న ఓ రైతు పొలం వద్ద మహిళా రైతులతో కాసేపు ముచ్చటించారు. చంద్లాపూర్ ప్రధాన ఎడమ కాలువ కింద పిల్ల కాల్వ తీసేందుకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం ప్రధాన కాల్వ వెంట మంత్రి కలియ తిరిగారు.

ఇంత కష్టపడి నీళ్లు తెస్తే.. తీరా మీరు వరి పంటలు వేస్తే ఏం లాభమని, కూరగాయల పంటలు పండించాలని మంత్రి రైతులకు సూచించారు. వాటి వల్ల వచ్చే లాభాలను వివరిస్తూ.. రైతులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా శంకరయ్య అనే రైతు తాను పత్తి పంట వేయగా రూ. లక్ష లాభం వచ్చిందని.. మిర్చి, కీరదోస తదితర పంటలు వేసి లాభం పొందినట్లు మంత్రికి వివరించారు. శంకరయ్యను అభినందించిన మంత్రి.. గ్రామంలోని యువ రైతులు శంకరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా తమకు గత కొన్ని రోజులుగా ఉపాధి హామీ పనుల డబ్బులు రాలేదని గ్రామస్థులు మంత్రికి విన్నవించారు. డబ్బులు ఇప్పించాలని మంత్రితో మొరపెట్టుకున్నారు. ఈ మేరకు డీఆర్డీఏ పీడీ గోపాల్ రావుతో ఫోన్​లో మాట్లాడిన మంత్రి.. పెండింగ్​లో ఉన్న చెల్లింపులు వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి: భూ కేటాయింపులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.