ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి హరీశ్ రావు అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. కరోనా దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేయాలని అధికార వర్గాలకు మంత్రి సూచించారు.
అధికారులు నిద్రలేని రాత్రులతో అహర్నిశలు కృషి చేసి అన్ని రంగాల్లో సిద్ధిపేట జిల్లాను తొలి స్థానంలో నిలుపుతున్నారని మంత్రి కొనియాడారు. కార్యక్రమం మొదలు నుంచి చివరి వరకూ శాఖల వారీగా అధికారులకు, నిర్వాహక బాధ్యతలను అప్పగిస్తూ చేపట్టాల్సిన విధులను వివరించారు.