సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో పల్లె ప్రగతి నిర్వహించారు. మంత్రి హరీశ్ రావు (minister harish rao) కార్యక్రమానికి హాజరై.. హరితహారం (Haritha Haram)లో భాగంగా ఆయిల్ పామ్(Oil Farm) సాగు మొక్కలు నాటారు. గ్రామంలో తిరుగుతూ అక్కడున్న సమస్యలను అడిగి తెసుకున్నారు. వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను సూచించారు. ఆయిల్‌పామ్ సాగును మరింత ప్రోత్సాహిస్తామని మంత్రి హరీశ్ రావు (minister harish rao) తెలిపారు. పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)కృషితో.. కాళేశ్వరం నీళ్లు మన దగ్గరకు వచ్చాయి. నీళ్ల వల్ల అవసరైమన తేమ ఏర్పడింది. సాగు నీరు అందుబాటులో ఉండడం వల్ల యాసంగిలో ... భారదేశంలో ఏ రాష్ట్రం పండించనంత వరిని తెలంగాణలో పండించాం. అందరూ వరిని పండిస్తే కాస్త నష్టం వస్తుంది అనే మాట వాస్తవం. అందుకే ఆయిల్‌పామ్‌ను పండించుకుందాం. అది చాలా లాభసాటి పంట. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల డిమాండ్‌కు తగ్గట్టుగా పంటను పండిస్తే రైతుకు మేలు జరుగుతుంది. ఒకప్పుడు తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగుచేయాలంటే సరిపడా నీరు ఉండేది కాదు.
ఇప్పుడు సిద్దిపేట జిల్లాల్లో పామాయిల్ సాగుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. విదేశాల నుంచి ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం కంటే... మనమే సాగు చేస్తే మంచిది కదా. రైతులు పామాయిల్ తోటలు పెంచుకుని.. అధిక లాభాలు పొందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక. పామాయిల్ సాగు చేస్తే రెండు మూడేళ్ల వరకు లాభం ఉండదని ఆలోచించవద్దు. ఆయిల్ సాగు చేసే వారిని ప్రభుత్వమే ఆదుకుంటుంది. అన్నివిధాలుగా ప్రోత్సాహమిస్తుంది. ఈ పంటకు కోతుల బెడద, చీడ పీడల బాధ ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోవాలి. తెలంగాణలో రైతులు ఆయిల్పామ్లను పెంచి... లాభాలు పొందాలని కోరుకుంటున్నారు.
-మంత్రి హరీశ్ రావు
ఆయిల్ఫామ్ సాగు చేసేలా సిద్దిపేట జిల్లా రైతులను ప్రోత్సాహిస్తామన్నారు. దేశంలో 8.25 లక్షల ఎకరాల్లో ఈ సాగు చేస్తున్నారన్నారు. విదేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోకుండా ఉండాలని.. అలా జరగాలంటే దేశంలో 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ఫామ్ సాగు చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ సంస్థ చైర్మన్ రామకృష్ణ రెడ్డి, హార్టి కల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: PALLE PRAGATHI: గుర్తించిన అన్ని సమస్యల్ని.. త్వరగా పరిష్కరించండి: హరీశ్ రావు