రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు సభ్యసమాజం సిగ్గుపడాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సమాజంలో మారాల్సింది అమ్మాయిలు కాదు అబ్బాయిలు మారాలన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ సహకారంతో విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందించే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు యోగా చేసే విధంగా చూడాలని మంత్రి అన్నారు. పాఠశాల అభివృద్ధికి మంత్రి రూ. 25 లక్షలు మంజూరు చేశారు. అనంతరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల పింఛను 1,500 నుంచి 3,016కు పెంచారని గుర్తు చేశారు. వీరి అభివృద్ధి కోసం రాష్ట్రంలో రూ. 840 కోట్లు ఖర్చుపెడుతున్నామని మంత్రి తెలిపారు. త్వరలో సిద్దిపేటలో దివ్యాంగులకు 200 స్కూటీలు అందిస్తామన్నారు.
ఇవీ చూడండి.. వెండితెరపై శభాష్ 'మిథాలీ'... నటి ఎవరో తెలుసా..?