ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులతో జూమ్యాప్ ద్వారా మంత్రి మంత్రి హరీశ్ రావు సమావేశమయ్యారు. విదేశాల్లో ఉన్న పిల్లలకు సైతం తెలంగాణ బతుకమ్మ సంస్కృతిని, సంప్రదాయాలను నేర్పుతున్న తల్లిదండ్రులను అభినందించారు. బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే గొప్ప పండుగని.. ప్రకృతిని, దైవంలా పూజించే పండుగని.. శాస్త్రీయంగా కూడా రుజువైందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత కరోనా సమయంలోనూ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగను గొప్పగా జరుపుకుంటున్నారని.. విదేశాల్లో ఉన్నవారు కూడా బతుకమ్మ, దసరా పండుగలు గొప్పగా జరుపుకోవడం అభినందనీయమని కొనియాడారు. ఆడపడుచులందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదీ చూడండి: ఆన్లైన్ ద్వారా సింగపూర్లో బతుకమ్మ సంబురాలు