ETV Bharat / state

haritha hotel launched : హరిత టూరిజం హోటల్​ను ప్రారంభించిన మంత్రి హరీశ్​రావు - సిద్దిపేట వార్తలు

haritha hotel launched : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేట జిల్లా దశ, దిశ మారిపోయిందని మంత్రి హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట శివారు నాగులబండ వద్ద నూతనంగా నిర్మించిన హరిత త్రీ స్టార్ టూరిజం హోటల్​ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

harish rao
harish rao
author img

By

Published : Dec 24, 2021, 10:28 PM IST

haritha hotel launched : తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశానికే తలమానికంగా నిలుపుతున్నట్లు మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. సిద్దిపేట శివారు నాగులబండ వద్ద నూతనంగా నిర్మించిన హరిత త్రీ స్టార్ టూరిజం హోటల్​ను మంత్రి ప్రారంభించారు. టూరిజం హోటల్ పక్కనే వందలాది మందికి ఉపాధి కల్పించే ఐటీ టవర్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు. టూరిజం హోటల్ ముందు 200 ఎకరాల్లో ఆక్సిజన్ పార్క్ విస్తరించి ఉందని అన్నారు. సిద్దిపేట జిల్లా 33 జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుందని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని దుద్దేడను అభివృద్ధి చేసుకుంటున్నామని.. రూ.100 కోట్లతో రంగనాయక సాగర్​ను పర్యాటక క్షేత్రంగా మారుస్తామని వెల్లడించారు.

సిద్దిపేటలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దృష్టిలోపంతో బాధపడుతున్న పేద ప్రజలను గుర్తించి సిద్దిపేటలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ద్వారా దృష్టి లోపల సవరణకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, పార్క్ హుస్సేన్ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా హోటల్ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Revanth Reddy on paddy procurement: 'ఆ పదివేల కోట్లు మాకివ్వండి.. మేమే ధాన్యం కొంటాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.