సిద్దిపేట జిల్లా గద్వాల్ పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో భూసార పరీక్షా కేంద్రం, సంగాపూర్ రోడ్డులో ఐఎంఏ వైద్యుల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.
గజ్వేల్ సమీకృత కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్హులైన పలువురు లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ రోజా శర్మ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య