ETV Bharat / state

Harish Rao: చెత్తను ఆదాయ వనరుగా మారుస్తాం... గ్యాస్​ తయారు చేస్తాం

author img

By

Published : Jul 1, 2021, 1:33 PM IST

చెత్త నుంచి సంపద సృష్టిపై అవగాహనకు స్వచ్ఛబడి ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్​రావు తెలిపారు. పట్టణప్రగతిలో భాగంగా సిద్ధిపేటలోని స్వచ్ఛబడిని ఆయన పరిశీలించారు. చెత్తతో తయారైన సేంద్రియ ఎరువులను ఆయన పరిశీలించారు. రేపటి తరానికి ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించేలా కృషి చేయాలన్నారు.

Minister Harish Rao
మంత్రి హరీశ్​రావు

పట్టణ ప్రగతిలో భాగంగా సిద్ధిపేటలోని స్వచ్ఛబడి(Swacha Badi)ని మంత్రి హరీశ్​రావు(Minister Harish Rao) ఆకస్మికంగా పరిశీలించారు. చెత్త నుంచి సంపదను ఎలా సృష్టించవచ్చో ప్రజలకు తెలిపేందుకే స్వచ్ఛబడిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చెత్తతో తయారైన సేంద్రియ ఎరువుల(Organic fertilizers)ను మంత్రి పరిశీలించారు. సేంద్రీయ-ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసిన కూరగాయల తోటను సందర్శించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో రోజు 40 టన్నుల చెత్త వస్తుందని... ఇలా అయితే పట్టణ ప్రజల ఆరోగ్యం పాడవుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే చెత్తపై అవగాహన కల్పిస్తూ... చెత్తనుంచి ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో నేర్పుతామని వెల్లడించారు. అందరూ స్వచ్ఛ బడికి వచ్చి చెత్తను ఎరువులుగా ఎలా మార్చుకోవాలో నేర్చుకోవాలని సూచించారు.

వ్యర్థాల నుంచి గ్యాస్​ తయారీ..

పసి పిల్లల నుంచి పండు ముసలి వరకూ స్వచ్ఛబడి చెత్త గురించి పాఠాలు నేర్పుతుందని వెల్లడించారు. చెత్తను సరైన విధంగా డిస్పోజ్ చేయకపోతే ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఇక్కడ చెప్తారని వెల్లడించారు. చెత్తను ఆదాయ వనరుగా మార్చి.. చెత్త రహిత పట్టణంగా మార్చే దిశగా అడుగులేస్తున్నామన్నారు. వ్యర్థాల ద్వారా గ్యాస్ తయారు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని... ఈ ఆలోచనతో ముందుకెళ్తున్నామని తెలిపారు. త్వరలోనే చెత్త ద్వారా గ్యాస్ వెలికి తీసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.

రేపటి భవిష్యత్తుకు చక్కటి ఆరోగ్యాన్ని అందించేలా అందరూ కృషి చేయాలని మంత్రి కోరారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని బహుమతిగా, ఆస్తిగా ఇవ్వాలన్నారు. ఆరోగ్య సిద్ధిపేట, ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 39వ మున్సిపల్ వార్డులో మిద్దెతోటలు పెంచుతున్న దంత వైద్యులు రామస్వామిని మంత్రి హరీశ్​రావు(Minister Harish Rao) అభినందించారు.

తూతూమంత్రంగా పనిచేయకూడదు..

పట్టణ, పల్లె ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు తూతూమంత్రంగా పనిచేయకూడదని... యుద్ధ ప్రాతిపదికన ప్రగతి సాధనలో ఆదర్శంగా నిలవాలని మంత్రి సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని వివరించారు. గ్రామ పంచాయతీలకు ప్రతినెల నిధులు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈజీఎస్ కింద సిద్దిపేట జిల్లాలో రూ.28.32 కోట్ల బిల్లులకు వెంటనే ప్రతిపాదనలు పంపిస్తే రెండు రోజుల్లో చెల్లిస్తామన్నారు. పనుల్లో నాణ్యత, ప్రమాణాల్లో రాజీ పడకుండా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతి పనులపై అంశాల వారీగా ప్రాధాన్యత పనులు చేపట్టాలని అధికారులను కోరారు.

అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు కాదని మంత్రి హరీశ్​ రావు అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కూడా అభివృద్ధిలో ఓ భాగమేనని.. నాలుగేళ్ల నుంచి డయేరియా లాంటి సీజనల్ వ్యాధులు లేవన్నారు. పల్లె, పట్టణ ప్రగతి ముగిసిన పది రోజుల తర్వాత అధికారులతో సమీక్షలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మండలానికో ఓ బృహత్ పల్లె ప్రకృతి వనం పది రోజుల్లో ప్రారంభించాలని.. దీని కోసం ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని మంత్రి సూచించారు. హరీశ్​ రావు వెంట మున్సిపల్ కమిషనర్ రమణాచారి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఏంసీ ఛైర్మన్ పాల సాయిరాం, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ దీప్తి నాగరాజు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: KTR: మొదలైన ఏడో విడత హరితహారం... మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.