గత ప్రభుత్వాలు ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర సర్కార్ స్థానిక సంస్థలకు రూ.699 కోట్లు కోత పెడితే రాష్ట్ర ప్రభుత్వం కడుపు నింపిందని అన్నారు.
సిద్దిపేటలో పర్యటించిన మంత్రి.. పలు వార్డుల్లో సీసీరహదారులకు శంకుస్థాపన చేశారు. పలు భవనాలను ప్రారంభించారు. పట్టణ పరిధిలోని తొమ్మిదో వార్డు రంగదాంపల్లి అభివృద్ధికి రూ.9 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా ప్రతి నెల రూ.300 కోట్లు ఖర్చు చేస్తుందని హరీశ్ రావు వెల్లడించారు. త్వరలోనే మహిళలకు వడ్డీలేని రుణాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలో ఐటీ పార్క్ ఇండస్ట్రియల్ రావడం ద్వారా ఈ ప్రాంత యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.