ETV Bharat / state

పేదలకు సేవ చేయడంలోనే అసలైన సంతృప్తి : హరీశ్ - సిద్దిపేట జిల్లా వార్తలు

నిరుపేదలకు సేవచేయడంలో నిజమైన సంతృప్తి కలుగుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్​ మండలంలో పర్యటించిన మంత్రి.. పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఖాతా, మైసంపల్లి గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు.

minister harish rao inaugurated double bedrooms in siddipet district
మంత్రి హరీశ్ రావు సిద్దిపేట పర్యటన
author img

By

Published : Dec 13, 2020, 7:52 AM IST

సిద్దిపేట జిల్లాలో ప్రారంభమైన రెండు పడక గదుల ఇళ్లను తన భార్యాపిల్లలకు చూపిస్తానని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. ఖాతా, మైసంపల్లి గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తానని చెప్పారు. నంగునూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

మరోవారం రోజుల్లో రైతు బంధు నగదును కర్షకుల ఖాతాలో జమ చేస్తామని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. రైతు శక్తిని బలోపేతం చేసేందుకే రైతు వేదికలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకుని లాభసాటి పంటలు వేయాలని, కాళేశ్వరం నీళ్లతో ఖాతా గ్రామంలోని చెక్ డ్యామ్​లన్నీ నిండుకుండలా మారాయని తెలిపారు.

మైసంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 25 రెండు పడకల ఇళ్ల ప్రారంభానికి హాజరైన మంత్రి.. లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉమా వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ సోమిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.