ETV Bharat / state

పద్నాలుగేళ్ల కృషి ఫలితమే తెలంగాణ : హరీశ్​ రావు - సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మంత్రి హరీశ్ రావు

తెలంగాణ కోసం పద్నాలుగేళ్లు పోరాడిన యోధుడు సీఎం కేసీఆర్​ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు కొనియాడారు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో నిర్వహించిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూరగాయల మార్కెట్​ ఆవరణలో భారీ కేక్​ కట్​ చేసి కేసీఆర్​కు శుభాకాంక్షలు తెలియజేశారు.

minister harish rao in cm kcr birthday celebrations in gajwel in siddipet district
పద్నాలుగేళ్ల కృషి ఫలితమే తెలంగాణ : హరీశ్​ రావు
author img

By

Published : Feb 17, 2021, 7:54 PM IST

రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్షను చేపట్టిన మహానేత సీఎం కేసీఆరేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు ప్రశంసించారు. శ్రీరామచంద్రుడు వనవాసం లాగా పద్నాలుగేళ్లు నిర్విరామంగా పోరాడి తెలంగాణ సాధించారని అన్నారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్​లోని కూరగాయల మార్కెట్ ఆవరణలో భారీ కేక్​ను కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

minister harish rao in cm kcr birthday celebrations in gajwel in siddipet district
మొక్కలు నాటుతున్న మంత్రి హరీశ్ రావు

కేసీఆర్​ గురించి ఒక్కమాటలో చెప్పమని అడిగారు :

కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా రింగురోడ్డుపై గజ్వేల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులచే భారీగా మొక్కలను నాటించారు. సీఎం కేసీఆర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే పట్టుదల, సమయస్ఫూర్తి, నిత్య విద్యార్థి, భాషపై పట్టున్న వ్యక్తి అన్నారు.

రింగ్​ రోడ్డుపై విద్యార్థుల ప్రదర్శన

క్రికెటర్​లాగా పోరాడారు :

పద్నాలుగేళ్ల కృషి ఫలితమే తెలంగాణ : హరీశ్​ రావు

పద్నాలుగేళ్లు ఓ క్రికెటర్​ లాగా పోరాడితేనే తెలంగాణ వచ్చిందన్నారు. క్రికెట్​ ఆటలాగే చివరి వరకు ఆడి విన్నింగ్ షాట్ కొట్టి రాష్ట్రం సాధించారని కొనియాడారు. ఆనాడు రవిశాస్త్రి పాకిస్థాన్​పై సిక్సర్ కొట్టి ఇండియాను గెలిపిస్తే.. నేడు కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ ఛైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రాజమౌళి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు మాదాసు అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'పెట్రో' ధరలను వెంటనే తగ్గించాలి: సీపీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.