సిద్దిపేట జిల్లా మహానగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో సంక్రాతి వేళ... స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ పతంగి ఎగరేశారు.
ప్రజల భాగస్వామ్యంతో సిద్దిపేట కీర్తి పతంగిలా దశదిశలో చాటుతామని వెల్లడించారు. సిద్దిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నెంబర్ వన్ అవార్డు వచ్చేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి హరీశ్ అన్నారు.
ఇదీ చదవండి: పతంగోత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి